సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను భావి తరానికి తెలియచెప్పేలా పండగలను ఘనంగా జరుపుకోవాలనిఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్ష షా అన్నారు. అధికారిక బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వద్ద గౌరమ్మకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. మహిళా అధికారులు, విద్యార్థులతో కలిసి సరదాగా కోలాటాలు ఆడుతూ బతుకమ్మ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు.