రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టిన ఘనత మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం మార్కాపురంలో నిర్వహించిన అన్నదాత పోరుబాట కార్యక్రమంలో పాల్గొని అనంతరం నాగార్జున రెడ్డి మీడియాతో మధ్యాహ్నం రెండు గంటలకు మాట్లాడారు. ఏది కావాలన్నా రైతులకు రైతు భరోసా కేంద్రాలతో బట్టలు నొక్కితే అందించే కార్యక్రమానికి శ్రీకరం చుట్టారన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు మేలు జరగడం లేదన్నారు.