అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కణేకల్లు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. బుధవారం ఉదయం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్ల కార్డులతో దీక్షలు చేపట్టారు. మండల కార్యదర్శి గౌస్ పీరా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో కనీసం రెండు సెంట్ల స్థలం పేదలకు ఇవ్వాలి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.