కోనసీమ వ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అమలాపురంలోని కలెక్టరేట్ అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం, రామచంద్రాపురం మండలంలో అత్యధికంగా 17.2 మి.మీ వర్షపాతం నమోదైంది. రాజోలు మండలంలో అత్యల్పంగా 2 మి.మీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 5.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.