Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: నల్లవాగు జలాశయంలోకి 2782 క్యూసెక్కుల ఇన్ఫ్లో: ప్రాజెక్టు ఏఈ శ్రీ వర్ధన్ రెడ్డి

Narayankhed, Sangareddy | Aug 30, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నల్లవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు లో భారీ ఇన్ ఫ్లో – 2782 క్యూసెక్కులు సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం లోని నల్లవాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు పై శనివారం వచ్చిన తాజా నివేదిక ప్రకారం, ఈ ప్రాజెక్టులో 2782 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్వాహకులు, ప్రాజెక్టు ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి ఈ వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. వారి ప్రకటనలో, ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (FRL) 1493 అడుగులు అని, ప్రస్తుతం నీటి స్థాయి 1493.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us