తాళ్లపూడి మండలంలోని రాగోలపల్లి, అన్నదేవరపేట ప్యాక్ సొసైటీలలో ఎరువుల వినియోగం మరియు సరఫరా పరిస్థితిని గురువారం కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూసారం, పంట విస్తీర్ణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. దశలవారీగా ఎరువులను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఎరువులు ఎక్కువగా వేసినంతమాత్రాన దిగుబడి పెరగదని, బదులుగా నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు కలెక్టర్.