గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ థామస్ శనివారం ఎస్. ఆర్. పురం లో పర్యటించి, మహిళాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయలు జమ చేయడం, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు అందించడం వంటి పథకాలను ఆయన ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.