కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వన్నారం గ్రామంలో ఘోరం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే సోమవారం సాయంత్రం కనపర్తి హనుమంతరావు అనే వ్యక్తి అతని పొలం వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుద్ధుల సమ్మయ్య, సారమ్మకు చెందిన గోర్లు హనుమంతరావుకు చెందిన పోలంలో చొరబడి వరి మేస్తున్నాయి. ఇది గమనించిన హనుమంతరావు గొర్లను తరలించేందుకు ప్రయత్నించాడు. హనుమంతరావు గొర్లు కొడుతున్న క్రమంలో సమ్మయ్య,సారమ్మ భార్యాభర్తలు వీరి వద్ద ఉన్న గొడ్డలితో హనుమంతరావు పొట్టపై,చేతులపై,ఛాతిపై ఒక్కసారిగా విచక్షణ రహితంగా దాడి చేశారు. స్థానికంగా ఉండే వారు చూసి అతన్ని కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం