శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం వేళ్లమద్దికి చెందిన రైతు కె.గంగప్ప దంపతులు భూసమస్యతో మనస్తాపానికి గురై గురువారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు అడ్డుకుని ప్రాణాలను రక్షించారు. సర్వే నం.283లో రోడ్డు వేయడం, తన భూమి చివరన వేసుకోవాలని కోరినా వినిపించకపోవడంతో వారు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది