తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం నల్ల వంతెన వద్ద ధర్నా నిర్వహించారు. వికలాంగుల శాతం తగ్గించి పింఛన్లు తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్యాయంగా పింఛను తొలగించిందని తమ పింఛన్లను తిరిగి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై పై బైఠాయించి ఆందోళన చేశారు