భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో, అసలు చివరి శుక్రవారం సందర్భంగా భక్తి రసతారకంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడ్డాయి. ఈ వ్రతాన్ని బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ శాస్త్రీయంగా, మంత్రోచ్ఛారణలతో నడిపించారు. సుమారు 1,500 మంది మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో ఉదయం 10 గంటలకు ఈ ప్రత్యేక వ్రతంలో పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వారు లక్ష్మీ రూపులు, పూజా సామాగ్రి అందజేశారని ఆలయ కమిషనర్ ర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.