తాండూర్ నియోజకవర్గం పెద్దమ్మ మండలం బండమీదిపల్లిలో శనివారం ఘనంగా భజన సమాప్తి వేడుకలను నిర్వహించారు భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహానికి గ్రామస్తులు భక్తులు చందన పూత చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి విగ్రహ మూర్తితో పల్లకి సేవ గ్రామంలోని వీధి వీధినా ఊరేగింపు కొనసాగించారు దారిపొడిన భక్తులు భజన కీర్తనలు పాడుతూ చిటికెల భజన చేస్తూ భక్తిపార్వశంలో మునిగిపోయారు