రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రావుకు స్థానిక కూరగాయల వ్యాపారస్తులు ఘన స్వాగతం పలికి కూరగాయల దండతో ఘనంగా సన్మానించారు. అనంతరం చిత్తారమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దామరచెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొని. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందించారు.