మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యంగా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కృషి చేయాలని కోరారు ఆసుపత్రి వెనుక భాగంలోని దివ్యాంగుల సదరం ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటు డయాలసిస్ కేంద్రాన్ని క్రిటికల్ కెరీ యూనిట్ భవనంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.