హుకుంపేట మండలం ఉప్ప గ్రామంలో దుడ్డు చంటి అనే నిరుద్యోగ యువకుడు మంగళవారం కరెంట్ షాక్కు గురై మరణించాడు. గ్రామంలో విధ్యుత్ లైన్ ద్వారా విధ్యుత్ రావడం లేదని గ్రహించిన చంటి పోల్ ఎక్కి సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడని స్థానికులు తెలిపారు. ఆపస్మారక స్థితిలో ఉన్న అతనిని గ్రామస్థులు వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా అతను అప్పటికే మరణించినట్లు తెలిపారు.