రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణను కోవూరు పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. తొలిరోజు ఆశించిన స్థాయిలో ఆయన నుంచి వివరాలను పోలీసులు రాబట్టలేకపోయారు. దీంతో ఏఎస్పీ సౌజన్య నేరుగా రంగంలోకి దిగారు. ఏఎస్పీ సౌజన్యతో పాటు డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, సిఐ నాగేశ్వరమ్మ ఆమెను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో అరుణ నుంచి కీలక సమాచారాన్ని వారు రాబట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది.