"ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో పని చేయాలి". ఎస్పీ మణికంఠ చందోల్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నేరుగా ఎస్.పి గారిని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇంచార్జ్ శ్రీ ఎస్.ఆర్.రాజశేఖర రాజు గారిని మరియు డి.టి.సి. డి.ఎస్పీ శ్రీ జె.రాంబాబు గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. *"ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యం"* అని ఎస్.పి గారు అన్నారు. *ఈ ఫిర్యాదులపై తక్షణ చర్య తీసుకొని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని* సంబంధిత పోలీసు అధికారులను ఆదశించారు.