Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
జిల్లాలో వరి కోతలు మొదలైన ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మూలివెంగయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరంలో జరిగిన మూడవ రైతు మహాసభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కనీసం మద్దతు ధర కోసం పోరాటం చేయాలన్నారు. రైతాంగం ఐక్య ఉద్యమాలు చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 9 మందితో రైతు సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు.