నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం కర్ర వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిలమంతుల రాజలింగం, కొలిప్యాక అంజయ్యలు తెలిపారు. ప్రతిరోజు హోమ కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కర్ర వినాయకుని దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.