విడవలూరు: సర్వే పేరుతో పొలాల నాశనం..! విడవలూరు మండలం పార్లపల్లిలోని తమ పంటలను ONGC కంపెనీ నాశనం చేసిందని పలువురు రైతులు వాపోయారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే పేరుతో పొలాల్లో గుంతలు తవ్వడంతో నష్టపోయామని వాపోయారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని MRO చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. ONGC పనులు ప్రారంభిస్తుందని తమకు కలెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం ఉందని చెప్పారు.