అధికారుల మాట ఖాతరు చేయకుండా రైల్వే కోడూరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా బొప్పాయి ధరలు తగ్గిస్తుండటంతో తమకు ఆత్మహత్యలే శరణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్వేల్ రైతులు శనివారం మాట్లాడుతూ.. కిలో బొప్పాయి పండించడానికి వంద రూపాయల పైన ఖర్చు అవుతుందని, అలాంటిది వ్యాపారులు తమకు 5 రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదని వారు తెలిపారు.