ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం సాయంత్రం 6గంటలకు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.. దెందులూరు మండలం సింగవరం గరుడా హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన బంధువులను ఆసుపత్రి నిబంధనల ప్రకారం సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. గాయపడినవారిని వెంటనే చూడనివ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు