తేదీ 13.09-2025 వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని శ్రీమతి ఎం.బబిత జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విజయనగరం ఉమ్మడి జిల్లాలైన, విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలలోని వున్నా న్యాయమూర్తులు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద భీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు మరియు ఎగ్జిక్యూషన్ పిటిషన్ ,ఎలక్ట్రిసిటీ కేసులు, ఎక్సజ్ కేసులు,