ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జోత్సవాలు ఉత్సవ భరిత వాతావరణం లో కొనసాగుతున్నాయి. 7వ రోజు నిమజ్జనం వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి వివిధ గణేష్ మండల్లా నిర్వాహకులు నిమజ్జన శోభాయాత్ర లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే, బ్యాండ్ మేళలతో ముందు యువకులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జనోత్సవ శోభాయాత్రలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.