అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ జంగం పుట్టు గ్రామంలో పాఠశాల భవనం లేక గ్రామస్తులు నిర్మించుకున్న రేకుల షెడ్డులోని తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడి సమస్యను వీడియో తీసి పాడేరు మీడియాకి చేరవేశారు. గ్రామంలో పాఠశాల భవనం లేక రేకుల షెడ్డులో విద్యా బోధన చేస్తున్న విషయాన్ని సంబంధిత శాఖల అధికారులకు అనేకమార్లు వెల్లరించిన పరిష్కారం కాలేదని ఈ ఏడాది అయినా గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని వారు కోరుతున్నారు.