టీ న్యూస్ ప్రతినిధి పై కేసును ఖండించిన వద్దిరాజు ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో రిపోర్టర్ సాంబశివరావు పై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. జిల్లాలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. యూరియా అందించలేని సర్కారు రైతులు, రైతు సంఘాల నాయకులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ నిర్బంధాలు ప్రయోగించడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలా ప్రశ్నించే వారిని కేసులు నిర్బంధాల పేరుతో భయపెట్టాలనుకోవడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. సాంబశివరావు పై పెట్టిన కేసును తక్షణం ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు...