తోకతిప్ప పంచాయతీ కార్యాలయం ప్రారంభం భీమవరం మండలం తోకతిప్ప గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మంగళవారం రెండున్నరకు ప్రారంభించారు. సుమారు రూ.18 లక్షలతో అధునాతనమైన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎంపీపీ, గ్రామ సర్పంచ్, కూటమి నాయకులు ఉన్నారు.