ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలో సోమవారం రాత్రి కొండవీడు ఎక్స్ప్రెస్ ట్రైన్ జనరల్ బోగీలో డోరు వద్ద కూర్చున్న వ్యక్తి కిందపడ్డాడు. ప్రమాదవశాత్తు ట్రైన్ కింద కాళ్లు పడి ఎడమ కాలు విరిగింది. వెంటనే తోటి ప్రయాణికులు రైలు ఆపి తిరిగి అదే రైల్లో అతన్ని మార్కాపురం రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు. అనంతరం దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వ్యక్తి గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు చెందిన హరిబాబు గా గుర్తించినట్లు స్థానిక ప్రయాణికులు తెలిపారు.