ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ములుగు (మం) పతిపల్లి గ్రామ సమీపంలోని పత్తి చేనులో పెద్దపులి అడుగులను ఫారెస్ట్ అధికారులు నేడు బుధవారం రోజున ఉదయం 6 గంటలకు గుర్తించారు. పెద్దపులి జాడ కోసం, ప్రత్యేక ట్రాప్ కెమెరాను ఏర్పాటు ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. పత్తిపల్లి, బుగ్గ చెరువు, ఎదల్ల చెరువు, పొట్లపూర్ గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా పెద్దపులికి హాని చేస్తే వైల్డ్ లైఫ్ ఆక్ట్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ తెలిపారు.