జిల్లాలో డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడం ద్వారా మహిళల సాధికారత కు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వార్షిక రుణ ప్రణాళిక మరియు డ్వాక్రా సంఘాల జీవనోపాదుల కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని , మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అధికారులుపనిచేయాలన్నారు.