నిన్న రాత్రి సుమారు 12:00 గంటల సమయంలో నెల్లిమర్ల మండలం, అలుగోలు గ్రామంలో వినాయకుని నిమజ్జనం చేయడానికి అదే ఊర్లో ఉన్న గుండాల చెరువునకు వెళ్లగా పంచాది గణపతి S/o నారాయణప్పుడు, వయస్సు 45, కాపు కులం( lic Agent) అనే అతను తను సెల్ఫోన్ను చెరువుగట్టు పైనున్న కెల్ల నీలా కుమార్ అనే అబ్బాయికి ఇచ్చి అందరితోపాటు వినాయకుని నిమజ్జనం చేయడానికి చెరువులోకి వెళ్ళాడు, వినాయక నిమజ్జనం అయిపోయాక అందరూ ఇంటికి వెళ్లిపోయారు. ఎంతకీ రాకపోవడంతో చెరువు వద్ద చూడగా మృతి చెందాడు.