పెద్ద కడబూరు:విద్యుత్ ఛార్జీల తగ్గింపు కోసం బషీరాబాద్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల ఆశయ సాధనకు పోరాడుతామని వామపక్ష పార్టీల నేతలు తిక్కన్న, వీరేశ్, పరమేశ్ స్పష్టం చేశారు. గురువారం పెద్ద కడబూరులోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బసషీరాబాద్ అమరవీరులకు మద్దతుగా నినాదాలు చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. కార్మిక, కర్షకుల పక్షాన వామపక్షాలు ఉద్యమిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.