కరీంనగర్ పట్టణంలోని మానేరు జలాశయం సమీపంలో ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నుండి వద్ద ఓ భారీ కొండ సిలువ కలకలం రేపింది. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్ర నుండి శ్రీ లక్ష్మీ జంతు సంరక్షణ శాల అధ్యక్షుడు సుమన్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఉత్పత్తి కేంద్ర సిబ్బంది. గత రెండు రోజుల నుండి చేపలు పెంచే ట్యాంకు వద్ద ఓ వలలో చిక్కుకొని ఉన్న ఓ భారీ కొండ సిలువ కదలలేక ఇబ్బంది పడుతుందని దాన్ని రక్షించేందుకు రావాల్సిందిగా తనకు ఫోన్ రావడంతో ఆ కొండచిలువను సురక్షితంగా రక్షించి అడవుల్లో వదిలిపెట్టినట్టు సుమన్ తెలిపారు.