నగర పశ్చిమ నియోజకవర్గంలో కొత్తగా మూడు (3) 33/11 KV సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ను కోరారు. మంగళవారం మధ్యాహ్నం ఆయనను మర్యాదపూర్వకంగా కలసి సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మంత్రి గొట్టిపాటి రవితో మాట్లాడుతూ గుంటూరులో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోందని, వేసవి కాలంలో 11 KV ఫీడర్లు ఓవర్ లోడ్ అవ్వడం వల్ల తక్కువ వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.