అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ భారీ ఎత్తున చోటుచేసుకుంది. అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి పూర్తి విషమంగా మారింది. ఏకంగా కట్టెలు రాడ్లతో దాడులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి రాళ్లతో దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.