వికారాబాద్ జిల్లా పరిగి పరిగి మున్సిపాలిటీ రోజురోజుకు విస్తరిస్తుంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల చాలా మంది ప్రజలు వ్యాపారం, విద్య , ఇతర అవసరాల కోసం పరిగి పట్టణానికి వచ్చి లక్షల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొని, ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉందామంటే రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని జిల్లా జేఏసీ అధ్యక్షులు ముకుంద నాగేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్లాట్ రిజిస్ట్రేషన్ చార్జీలు, గ్రామపంచాయతీ లేఅవుట్లు, ఎల్ఆర్ఎస్, గృహ నిర్మాణాల అనుమతి చార్జీలు ప్రతి సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేస్తూ ప్రజలకు సరియైన సదుపాయాలు