ములుగు జిల్లా కేంద్రం లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ డా.శబరిష్ ఐపీఎస్ నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్, సస్పెక్ట్ షీటర్స్ గురించి ఆరా తీసి, వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలని, వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా జిల్లాలో విగ్రహాలు ప్రతిష్టించే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొనేలా చూడాలని అన్నారు. అలాగే విగ్