నల్లగొండ జిల్లా: రోడ్డు భవనాలు సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ వినాయక చవితి ఆశీస్సులు ఉండాలని అన్నారు .రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రజలందరిపై విగ్నేశ్వరుడు కృప ఉండాలని ప్రార్థించారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పట్టి వినాయకులను పూజించాలని తెలిపారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలన్నారు.