కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఈ సందర్బంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని దిగువ పట్టణం కాలనీలోని ఆర్ఎంపి డాక్టర్ కొత్త భవనం పై పిడుగు పడింది. దీంతో స్లాబ్, పిఓపి పూర్తిగా దెబ్బతినిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.వర్షం కురుస్తున్న సమయంలో పడిన పిడుగుపాటుకు దిగువపట్నం కాలనీలోని పలు గృహాల్లోని ఫ్రిజ్జులు, టీవీలు, వీధి బల్బులు దెబ్బతిన్నాయి.