రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించిందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని ఆయన ఆరోపించారు. అర్హులకు ఇళ్లు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి అర్హులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.