నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పేర్క కొండారం గ్రామంలోని స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు రావలసిన యూరియా పై కూడా ఎంపీలమంతా పోరాడుతున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.