గత కొన్ని నెలలుగా స్థానిక వేంపల్లి పంచాయతీ పరిధిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, దీనిపై అధికార టిడిపి నాయకులకు ఓట్లపై ఉన్న శ్రద్ధ, అభివృద్ధిపై లేకపోవడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కుళాయమ్మ ని కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడిపి నేతలకు పోలింగ్ బూత్ లపై ఉన్న శ్రద్ధ, నియోజకవర్గంలోని వేంపల్లె గ్రామ పంచాయతీ మీద లేకపోవడం సిగ్గుచేటన్నారు. పారిశుధ్య సమస్యలను పట్టించుకునే నాథుడే లేరంటూ మండిపడ్డారు.