మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది నెల్లికుదురుకు చెందిన రాధమ్మ (75)ను బంగారం కోసం శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఒంటరిగా ఉంటున్న రాధమ్మ మెడ నుంచి దొంగలు బంగారం లాగే ప్రయత్నం చేశారు. దీంతో వృద్ధురాలు చైన్ను వదలకపోవడంతో తల మీద గాయపరిచి ఇంటి ముందు ఉన్న బావిలో తోసేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.