నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో గురువారం ఉదయం వరకు నమోదైన వర్షం వివరాలను అధికారులు వెల్లడించారు. నిజాంపేట్ లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగలిగిద్దలో 7.9 సెంటీమీటర్లు, మనూర్ లో 6.8 సెంటీమీటర్లు, కంగ్టిలో 6.1 సెంటీమీటర్లు, కల్హేర్లో 5.8 సెంటీమీటర్లు, నారాయణఖేడ్లో 5.5 సెంటీమీటర్లు, సిర్గాపూర్ లో 4.6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.