తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ శివారులో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో రేణిగుంట కు చెందిన హసీనాకు తీవ్రగాయాలు అయిన ఘటన ఆదివారం సాయంకాలం చోటుచేసుకుంది వివరాలకు వెళితే రేణిగుంటకు చెందిన హసీనా దంపతులు గూడూరు నుండి రేణిగుంట వస్తున్న క్రమంలో ఓ ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీకొనడంతో హసీనాకు తీవ్రగాయాలయ్యాయి హసీనాను 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి తరలించగా అక్కడ ప్రధమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించుకుని వైద్యులు సూచించారు పోలీసులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకొని ఘటన గల కారణాలు విచారణ చేపట్టారు