శ్రీ సంపత్ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామివారి ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రామారావు పేట దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యాలయం ఆవరణలో గలశ్రీ సంపత్ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో నాలుగో రోజు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామివారి ఏకాదశి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ జోగయ్య శాస్త్రి మాట్లాడారు. స్వామివారికి 11 రకాల ద్రవ్యాలతో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం పంచామృత అభిషేకాలు నిర్వహించారు.