రంగారెడ్డి జిల్లా ఐఎస్ సదన్ లోని బిజెపి ఆధ్వర్యంలో గణనాథుడిని ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గణనాథుడి వద్ద ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులు ప్రాంత ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భక్తులందరూ భక్తి భావాన్ని చాటుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.