కర్నూలు నగరంలో సమస్యల పరిష్కారానికి విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను హెచ్చరించారు. శనివారం ఉదయం 10 గంటలకు పెద్ద మార్కెట్, వినాయక ఘాట్ వద్ద మున్సిపల్ దుకాణాలు, పరిసర ప్రాంతాలు, కింగ్ మార్కెట్ కమ్యూనిటీ హాల్, కిడ్స్ వరల్డ్ వద్ద డ్రైనేజీ కాలువ ఓవర్‌ఫ్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో అవసరమైన మరమ్మత్తు పనులను ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.