భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పి ఎ సి ఎస్ సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో చెప్పులు, గొడుగులు ఆధార్ కార్డు జిరాక్స్ లు ఉంచి పిఎసి ఎస్ సిబ్బంది కోసం ఎదురు చూస్తున్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్న ఒక్క కట్ట యూరియా దొరకడం లేదని ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చిన రేపు మాపు అంటూ తిప్పుతున్నారని మహిళా రైతులు వాపోతున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డ ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇస్తున్నారని 10 ఎకరాలు మొక్కజొన్న వేసిన రైతులకు ఒక కట్ట ఎలా సరిపోతుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.