కర్నూలు రైల్వే వ్యాగన్ పనులు పూర్తిచేసి యువతకు ఉపాధి కల్పించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం 12 గంటలు డివైఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కర్నూలు నగరంలో జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అద్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిందని వారు విమర్శించారు